Sand Online Booking: ఆన్‌లైన్‌లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్‌లోనే..!
- ఏపీలో ఉచిత ఇసుక ఆన్ లైన్ బుకింగ్ విధానం..
- ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు..
- గ్రామ.. వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం..
- ఇసుక రవాణాదారులు తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Online Booking: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కూటమి నేతలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్టాక్‌ను బట్టి ఇసుక సరఫరా కొనసాగిస్తున్నారు.. అయితే, ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుడుతోంది చంద్రబాబు నాయుడు సర్కార్.. ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది.
Read Also: UPI Lite: చిన్న లావాదేవీల కోసం సరికొత్త ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.. జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఇసుక స్టాక్ ఎంత ఉంది..? సరఫరా కేంద్రాలెన్ని..? లాంటి వివరాలను కూడా పోర్టల్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.. 2000 చదరపు అడుగుల్లోపు నిర్మాణాలకు సాధారణ బుకింగ్స్ అమలు చేయనుండగా.. 2000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునేలా పోర్టల్ రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట ఈ పోర్టల్ రూపొందించారు.. ఇక, అధికారులు ఇప్పటికే ఏపీ ఇసుక నిర్వహణ పోర్టల్, యాప్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాల వివిధ శాఖల ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చారు. సెప్టెంబరు 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అది ఆలస్యమైంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!