Chandrababu: మద్యం ధరలు, ఇసుక సరఫరాపై సమీక్షలో చంద్రబాబు వార్నింగ్
- మద్యం ధరలు.. ఇసుక సరఫరాపై చంద్రబాబు సమీక్ష
- అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఎం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మద్యం ధరల విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: PKL: హమ్మయ్య… గెలిచారు… తెలుగు టైటాన్స్ విజయం
Also Read
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
ఎంఆర్పీకి మంచి మద్యం అమ్మినా, బెల్టు షాపులు ప్రోత్సహించినా మొదటి సారి రూ.5లక్షల జరిమానా విధించాలని.. రెండోసారి తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ రెండు విధానాలపై అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలని సూచించారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉండాలని.. ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి షాపు దగ్గర మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండాలన్నారు. మద్యం షాపుల దగ్గర ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలన్నారు.
ఇది కూడా చదవండి: Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..
ఇసుక సరఫరాపై..
అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై కూడా తాజా పరిస్థితిని చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇసుక లభ్యత పెంచాలని.. అన్ని రీచ్ ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటి బాధ్యత అధికారులదేనన్నారు. తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!