CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
- ఇసుక.. లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు
- చెత్త పన్ను రాష్ట్రంలో తీసి వేసాం- సీఎం
- రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నాం- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రథాలు తగలబెట్టడం, ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి.. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి.. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయన్నారు. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు.
Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి వాడకంతో.. తల్లికి, చెల్లికి, కూతురికి తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటివి ఇక మీదట జరగకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు.. ఆ చెత్తలో వేసి వాళ్ళని కప్పి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను రాష్ట్రంలో తీసేశాం.. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టారు.. రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నామని తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల గుంతలు పూడుస్తాం.. నూతన సంవత్సరానికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
RGV: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని.. విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. ఇండస్ట్రియల్ హబ్‌గా అద్భుతమైన సిటీని నిర్మిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. ఎన్డీఏ కూటమి పాలసీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో స్వర్ణకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తాం.. పరిశ్రమల ఏర్పాటులో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలు చూడకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు.. అలాగే బయట వారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఉపాధి పొందవచ్చని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!