YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అయితే, జగన్ ధర్నాకు పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇస్తున్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్‌లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.
పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘సెంగోల్’ని ప్రతిష్టించారు. ఆ సమయంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సెంగోల్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్కే చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Loksabha Elections 2024 : కేంద్ర రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ పెద్ద పాత్ర పోషిస్తోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఉత్తరప్రదేశ్ ఈసారి షాక్ ఇచ్చింది. ఫలితంగా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్‌వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని ఖరేవాన్ సరయ్మీర్లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో సమాజ్‌వాదీ పార్టీ భారత కూటమి అభ్యర్థి జ్యోత్స్నా గోండ్, దాద్రౌల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో ఎస్పీ అభ్యర్థి అవధేష్ వర్మతో పాటు జిల్లా అధ్యక్షుడు, సమాజ్‌వాదీ పార్టీ నేతలంతా ప్రస్తుతం బలంగా ఉన్నారు.