YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అయితే, జగన్ ధర్నాకు పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు ఎంపీలు రాంగోపాల్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన శివసేన ( ఉద్ధవ్ వర్గం) లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ శేవాలే, రాజ్య సభ సభ్యులు సంజయ్ రౌత్, అలాగే, తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై వెళ్లి మద్దతు ప్రకటించారు.
Read Also: Minister Nimmala Ramanaidu: గత ప్రభుత్వం పోలవరాన్ని గోదాట్లో ముంచింది..!
ఈ సందర్భంగా శివసేన ( ఉద్ధవ్ ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళనకు మద్దతు ఇస్తున్నామన్నారు. మహారాష్ట్రలో కూడా ఇలాగే జరిగింది.. ప్రతీకార రాజకీయాలు సరైంది కాదు అని తేల్చి చెప్పారు. ఇక, ఏపీలో జరిగిన దాడులపై కేంద్ర హోం శాఖ వెంటనే ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై ఇండిపెండెంట్ విచారణ జరగాలి.. ఇలా దాడులకు పాల్పడ్డ వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదు అని సంజయ్ రౌడ్ పేర్కొన్నారు.
Read Also: YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!
అయితే, శివసేన (ఉద్ధవ్ ) లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ షేవాలే మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితి అత్యంత విచారకరం అన్నారు. మణిపూర్ లాంటి పరిస్థితులు ఉన్నాయి.. కేంద్ర హోంశాఖ చూస్తూ ఊరుకోవద్దు అని కోరారు.. శివసేనను మహారాష్ట్రలో ఎంతో ఇబ్బంది పెట్టారు.. అయినా వదిలిపెట్టలేదు.. జగన్ నువ్వు నిలబడాలి.. మేం జగన్ వెంట ఉంటామని భరసా ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాంటి పరిస్థితిలో నుంచి బయటపడేయాలి అని రాహుల్ షేవాలే డిమాండ్ చేశారు.
Read Also: Bigg Boss-Amrutha Pranay: బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్!
ఇక, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏఐఏడీఎంకే పార్టీ ఎంపీ తంబి దురై మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తాయి పోతాయి.. అధికారం ఉంటుంది పోతుంది.. కానీ, ఇలా దాడులు చేసుకోవడం మంచిది కాదు.. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి కనిపించింది.. దాదాపు తమిళనాడులో 590 మందిని చంపేశారు.. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నట్టే తమిళనాడులో కూడా జరిగింది అన్నారు.