ప్రభాస్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లేకుండా భారీగా రిస్క్ చేస్తున్నాడట.. మరి ప్రభాస్ ఏం చేస్తున్నాడు.. కొత్త సినిమాల అప్టేట్ ఏంటి..! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. రాధే శ్యామ్ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయిన డార్లింగ్.. ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్…
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
సాధారణంగా ఒకట్రెండు హిట్లు పడగానే హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. గత సినిమాలు రాబట్టిన కలెక్షన్లు, దాని వల్ల తమకు పెరిగిన మార్కెట్ & క్రేజ్ ని బట్టి.. హీరోలు కొంత అమౌంట్ పెంచుతారు. నిర్మాతలు సైతం ఆయా హీరోలకున్న క్రేజ్ ని చూసి.. అడిగినంత డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నదెవరైనా ఉన్నారంటే.. అది రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా…
భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. జాతీయంగా అనూహ్యమైన క్రేజ్ గడించిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పోస్టర్లతో ఊరిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. నిజానికి.. మే చివరి వారంలోనే ‘సలార్’ టీజర్ రావాల్సింది కానీ, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్…
‘బాహుబలి’ సిరీస్ కారణంగా జాతీయ స్థాయిలో స్టార్డమ్ వచ్చినప్పటి నుంచీ ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ఆల్రెడీ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేసేశాడు. ఈ సినిమా ఒప్పందం సమయంలోనే సిద్ధార్థ్ ఆనంద్‌తోనూ ఓ సినిమాకి ప్రభాస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలొచ్చాయి. అంతే, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని, ఆ వార్తలు కేవలం రూమర్స్ అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం…
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్…