ప్రభాస్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లేకుండా భారీగా రిస్క్ చేస్తున్నాడట.. మరి ప్రభాస్ ఏం చేస్తున్నాడు.. కొత్త సినిమాల అప్టేట్ ఏంటి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. రాధే శ్యామ్ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయిన డార్లింగ్.. ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే తన తదుపరి చిత్రాలతో సాలిడ్ హిట్ ఇవ్వాలని.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్. అందుకే బ్యాక్ టు బ్యాక్ సలార్, ప్రాజెక్ట్ కే.. సినిమాల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. దాదాపు మూడు నెలలుగా రెస్ట్ లెస్‌గా వర్క్ చేస్తున్నాడట డార్లింగ్. రీసెంట్‌గా మొదలు పెట్టిన సలార్ షెడ్యూల్ కూడా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. దాంతో త్వరలోనే మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారట. అయితే ఈ లోపు Project K కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవబోతున్నాడట డార్లింగ్. ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇలా ప్రభాస్ ఈ రెండు భారీ చిత్రాలను ప్యార్లల్‌గా.. రెస్ట్ లేకుండా కంప్లీట్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాల్లోని క్యారెక్టర్‌కు తగ్గట్టుగా.. ఎప్పటికప్పుడు కొత్తగా మేకోవర్ అవుతున్నాడు. అందుకే ఒక్కోసారి ఒక్కో లుక్‌లో దర్శనమిస్తున్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలు అయిపోగానే వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మొదలుపెట్టబోతున్నాడు. అలాగే మధ్యలో మారుతితో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక సలార్ సినిమాను కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.. ప్రాజెక్ట్ కెను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రజెంట్ ప్రభాస్ రెస్ట్‌లెస్‌గా పని చేస్తున్నాడని చెప్పొచ్చు.