భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. జాతీయంగా అనూహ్యమైన క్రేజ్ గడించిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పోస్టర్లతో ఊరిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. నిజానికి.. మే చివరి వారంలోనే ‘సలార్’ టీజర్ రావాల్సింది కానీ, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో కుదరలేదు.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు టీజర్ రిలీజ్‌కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట! జులై రెండో వారంలో ఈ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రానుందట! ఇప్పటివరకూ షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్సుల్లో నుంచి కొన్ని షాట్స్‌ను ఈ టీజర్‌లో చూపించనున్నారట! అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే! ఎందుకంటే.. రీసెంట్‌గా వచ్చిన రాధేశ్యామ్ తీవ్రంగా నిరాశపరచడంతో, ఈ సినిమా మీదే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్ఛితంగా రికార్డులు తిరగరాస్తుందని భావిస్తున్నారు.
కాగా.. సలార్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘సలార్’ను వచ్చే ఏడాది సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.