Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటే ప్రభాస్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆది పురుష్ ను ఇప్పటికే పూర్తి చేసిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక దీనివలన ప్రభాస్ లుక్ మాటిమాటికీ మారిపోతూ ఉంది. దీంతో ప్రశాంత్ నీల్, ప్రభాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
షెడ్యూల్స్ ను బట్టి ప్రభాస్ సలార్ సినిమాలో పాల్గొంటున్నాడు. అయితే షెడ్యూల్ లో పాల్గొన్న ప్రతిసారి డార్లింగ్ లుక్ మారిపోవడంతో ప్రశాంత్ నీల్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నాడని, వారి అసిస్టెంట్స్ వద్ద ఆగ్రహం చేస్తున్నాడట. ఇక ఏం చేయాలో తెలియక యాక్షన్ సన్నివేశాల్లో ప్రశాంత్ డూప్ తో మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాహో లో కూడా ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలను డూప్ తోనే తీసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకున్నదని టాక్. ఈ లెక్కన ఎప్పుడు ఈ చిత్రం 100 శాతం పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అని అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.