Salaar:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎట్టకేలకు సలార్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా అప్డేట్ కావాలని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆగస్టు 15 సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ షాక్ ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇక దీంతో పాటు ప్రభాస్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ రౌద్ర లుక్ లో కనిపించాడు. యుద్ధ రంగంలో వీర సైనికుడి మాదిరి వీరోచితంగా కనిపించాడు. రక్తంతో తడిచిన కత్తులను రెండు చేతులతో పట్టుకొని, ఒంటినిండా గన్నులు పెట్టుకొని కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపిస్తాడేమో అని అనుమానాలు రాకమానదు.
ఇక ప్రశాంత్ నీల్ మార్క్ ను ఈ పోస్టర్ తెలియజేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కాకుండా గ్రే కలర్ లో పోస్టర్ ఆకట్టుకొంటుంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను ట్రెండ్ లిస్టులోకి పంపించేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ పోస్టర్ వచ్చింది అని ఆనందపడాలో.. ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడానికి ఏడాది ఉందని బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.. అయితే కనీసం పోస్టర్ లోనైనా ప్రభాస్ ను చూసుకొనే అవకాశం కల్పించినందుకు ఆనందపడుతున్నామని చెప్పుకొస్తున్నారు అభిమానులు.
'𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/8vriMflG84
— Salaar (@SalaarTheSaga) August 15, 2022