‘బాహుబలి’ సిరీస్ కారణంగా జాతీయ స్థాయిలో స్టార్డమ్ వచ్చినప్పటి నుంచీ ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ఆల్రెడీ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేసేశాడు. ఈ సినిమా ఒప్పందం సమయంలోనే సిద్ధార్థ్ ఆనంద్‌తోనూ ఓ సినిమాకి ప్రభాస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలొచ్చాయి. అంతే, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని, ఆ వార్తలు కేవలం రూమర్స్ అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు.
అయితే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఉందట! ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోవడం వల్ల, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి వీలు పడలేదని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అవి ముగిసిన తర్వాత సిద్ధార్థ్ – ప్రభాస్ కాంబో సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే! అయితే, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదే క్లారిటీ లేదు.
కాగా.. ప్రభాస్ చేస్తోన్న సినిమాల్లో సలార్, ఆదిపురుష్ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అలాగే, మారుతి డైరెక్షన్‌లో చేయనున్న సినిమా సైతం 2023లోనే రిలీజ్ కానుంది. కానీ, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ప్రాజెక్ట్ కే’ మాత్రం 2024లో రిలీజ్ కానుంది. అటు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. దీనిని పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.