ఈ యేడాది ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. మరో రెండు డజన్ల చిత్రాలు వివిధ దశలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... సెప్టెంబర్ నెల ఫస్ట్ అండ్ లాస్ట్ వీకెండ్స్ లో తెలుగు పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది పెద్దనాన్న కృష్ణంరాజు మృతి తరువాత ప్రభాస్ నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడో ఏమో.. వరుస సినిమాలతో కొంచెం కూడా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తోనే బిజీగా మారాడు.
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోంది సలార్ మూవీ. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. కంప్లీట్ బ్లాక్ థీమ్ తో, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది సలార్ సినిమా. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కి ఈరోజు ఎండ్ కార్డ్ పడింది. ‘ఇట్స్ ఏ వ్రాప్ ఫర్ ఆద్య’…
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా, ఏ జోనర్ లో సినిమా చేసినా ప్రతి మూవీకి కామన్ గా జరిగే ఒకేఒక్క విషయం ‘అప్డేట్ లేట్ గా రావడం’. ప్రభాస్ సినిమా అంటే చాలు అప్డేట్ బయటకి రాదులే అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు సినీ అభిమానులు. ఈ తలనొప్పితో ప్రభాస్ ఫాన్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా యువీ క్రియేషన్స్…
సినిమా వ్యాపారం అనేది రిస్క్ తో కూడుకున్నది, ఎన్ని సినిమాలు హిట్ అయినా… ఎన్ని కోట్లు రాబట్టినా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు మళ్లీ మొదటికి వచ్చి నిలబడాల్సి ఉంటుంది. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఉన్నది కూడా అమ్ముకోని, తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. పైసా మే పరమాత్మ అనే మాటని తూచా తప్పకుండా పాటించే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ గా నిలబడాలి అంటే…
ఇండియన్ కమర్షియల్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి బాహుబలి లాంటి ప్రభాస్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు అనే వార్త వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ‘సలార్’ గురించి బయటకి వచ్చే వార్తలన్నీ రూమర్స్ లానే చూడాలి. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది అనే…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా…