కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్‌లో కాంగ్రెస్ నాయకుడు "విడాకులు తీసుకున్నాను" అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది.
Rajasthan Election 2023: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజకీయాలతో పాటు నిజ జీవితంలోనూ మెజీషియన్ అంటారు. కాంగ్రెస్ ఏ వ్యూహంతో తన మాట విని తాను అనుకున్నది చేస్తుందో ఆయనకు తెలుసు.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రకటించారు.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
Sachin Pilot: రాజస్థాన్‌లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం..పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. సచిన్ పైలట్ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అసత్య ప్రచారం.. ఒట్టి పుకార్లు మాత్రమేనంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు.
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు.