ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్‌తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు.
ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు.
ashok gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రత్యర్థి సచిన్ పైలట్, ఇతర పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి గెహ్లాట్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు.…
తన సొంత గడ్డపై సమస్య తలెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక…
congress presidential election triggered a crisis in the Rajasthan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ వర్గాల మధ్య పొసగడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ బాధ్యతలు చేపడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. అయితే…