శబరిమల ప్రస్తుతం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఆన్‌లైన్ స్లాట్‌లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో మరో పాతిక వేల మందికి…
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత సాధించారు. కేరళలోని శబరిమల ఆలయంలో పూజలు చేసిన తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ముర్ము నిలిచారు. 1970లలో వివి గిరి తర్వాత శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ రాష్ట్రపతి ముర్మునే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో వచ్చిన ఆమె అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. Also Read: Success Story: తల్లికి వాగ్దానం చేసి.. 150కి పైగా డిగ్రీలు చేసిన కొడుకు! టర్గెట్ ఏంటో…
రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ రెండు కాకుండా శబరిమలలో కూడా అధికారిక రాష్ట్రపతి భవనం ఉందని ఎంత మందికి తెలుసు. శబరిమలలో రాష్ట్రపతి భవనం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. దీని బ్యాగ్రౌండ్ తెలియాలంటే అయితే ఈ వార్త చదవాల్సిందే.
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప స్వామి వారి దివ్య ప్రసాదం కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన అసవరం లేదు. ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయంను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కలిపిస్తోంది. ఈ సదుపాయం మరో నెలలో అమలులోకి రానుంది. టీడీబీ ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు ట్రావెన్‌కోర్ పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు…
Droupadi murmu: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి…
Mammootty-Mohanlal: మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ వివాదం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మోహన్‌లాల్ మమ్ముట్టి తరుపున శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో పూజ చేయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముస్లిం అయిన మమ్ముట్టి (అసలు పేరు మహ్మద్ కుట్టి) పేరుతో ఎలా పూజ చేయిస్తారని ఆయన వర్గానికి చెందిన కొందరు విమర్శిస్తున్నారు. మమ్ముట్టి పేరులో పూజ నిర్వహించిన రసీదు బయటకు రావడంతో ఒక్కసారి ఇది కేరళలో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రసీదు వైరల్‌గా…
సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు.
Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతున్నట్లు సమాచారం. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే, రద్దీ కారణంగా 4…
Sabarimala Devotees: కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం, ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బీమా పథకం ద్వారా యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. Also Read: CM Revanth Reddy : సీఎం రేవంత్…
Sabarimala: శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.