రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ రెండు కాకుండా శబరిమలలో కూడా అధికారిక రాష్ట్రపతి భవనం ఉందని ఎంత మందికి తెలుసు. శబరిమలలో రాష్ట్రపతి భవనం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. దీని బ్యాగ్రౌండ్ తెలియాలంటే అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన.. ఫ్రీగా టోల్ గేట్లు ఎత్తివేత
కేరళలోని శబరిమల సన్నిధానం లోపల రాష్ట్రపతి భవనం ఉంది. ఈ భవనం అధికారికంగా భారత రాష్ట్రపతి పేరు మీద రిజిస్టర్ అయినట్లుగా అధికారిక రికార్డులు ఉన్నాయి. అయితే ఈ భవనం 1978లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా 40 సెంట్ల భూమిని అటవీశాఖ 99 సంవత్సరాల పాటు బీఎస్ఎన్‌ఎల్ సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే కేంద్ర సంస్థల అధీనంలో ఉండే ఆస్తులను రాష్ట్రపతి పేరుతోనే రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అలా అప్పట్లో భారత రాష్ట్రపతి పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ మేరకు అధికారిక రికార్డులు కూడా చెబుతున్నాయి. దీంతో ఇప్పటికీ ఆ భవనం రాష్ట్రపతి భవన్‌గానే పిలువబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్, కార్యాలయం కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
ప్రారంభంలో శబరిమలలో 30 కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం లక్ష రూపాయుల ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. ఏడాది పొడవునా ఇక్కడ కార్యాలయం కొనసాగుతుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రల కాలంలో కమ్యూనికేషన్‌ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యుత్తమ పని తీరుతో కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళలోని తిరువనంతపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం, శివగిరి సందర్శన, రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ విగ్రహా ఆవిష్కరణ, రెండు కళాశాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.