శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశంలో భారత్ మార్కెట్లో రష్యా ఎరువులు, వాణిజ్యం అజెండాలో ఉన్నాయని రష్యా వార్తా పత్రిక క్రెమ్లిన్ వెల్లడించింది.
Russia, Myanmar, Belarus Not Invited For Queen's Funeral:యూకే రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాజిల్ లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వివిధ దేశాధినేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19న జరగనున్న క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు వివిధ దేశాలను బ్రిటన్ ఆహ్మానించింది. అయితే మూడు దేశాలను మాత్రం బ్రిటన్ ఆహ్వానించలేదని…
ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ సదస్సుకు చైనా, రష్యా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్తాన్ ప్రధానులు హాజరుకానుండడమే.
ఈ యుద్ధంలో రష్యాకు ఉక్రెయిన్ సేనలు భారీ షాకిచ్చాయి. ఉక్రెయిన్‌లోని ఖార్ఖీవ్ ప్రావిన్స్‌లో కీలక నగరమైన ఇజియంను రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
Make Love Not War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు ఓ జంట ప్రేమ కూడా నడిపిస్తోంది. రష్యాలో జన్మించిన వ్యక్తి, ఉక్రెయిన్‌లో జన్మించిన మహిళ ప్రేమించుకుని భారత్‌లో ఒక్కటయ్యారు. ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉక్రెయిన్…
ISIS Plan To Attack In India: భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసింది. అధికార పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ ప్లాన్ ను భగ్నం చేసింది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). ఇండియాలో ఆత్మాహుతి ఉగ్రదాడి చేసేందుకు ఐసిస్ కుట్రను ముందుగానే పసిగట్టింది రష్యా. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రష్యా అధికారులు. ఈ విషయాన్ని సోమవారం రష్యా వార్త…
విద్వేషాలకు ప్రేమ అతీతమంటూ రష్యాకు చెందిన అబ్బాయి, ఉక్రెయిన్‌కు చెందిన అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ యుద్ధం ఈ ప్రేమ జంటను విడదీయలేకపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన యువతి, రష్యాకు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
రష్యాలోని మాస్కోలో 15 అంతస్తుల భవనంలో రాత్రిపూట జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో ఫైర్ అలారం పనిచేయలేదని అధికారులు తెలిపారు. మాస్కోలోని ఆగ్నేయం దిశగా ఉన్న ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయని.. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.