Home
Russia
Russia News
-
యూనివర్సిటీలో కాల్పులు.. 8 మంది విద్యార్థులు మృతి
రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.. తోటి విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కాల్పులకు తెగబడ్డాడు.. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, కాల్పులు జరుగుతోన్న సమయంలో.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. పై అంతస్తు నుంచి కిందకు దూకారు.. మరికొందరు విద్యార్థులు.. అలా కూడా కొంతమంది గాయాలపాలయ్యారు. -
కరోనా ఎఫెక్ట్: ఐసోలేషన్‌లో రష్యా అధ్యక్షుడు..!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతూనే ఉంది.. కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తగిలింది.. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలంది.. దీంతో పుతిన్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు రష్యన్ మీడియా పేర్కొంటోంది. ఇక, కోవిడ్ దెబ్బతో అంతా ఆల్‌లైన్ మయం కాగా.. ఇప్పుడు పుతిన్ కూడా వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాల్లో పాల్గొంటారని క్రెమ్లిన్… -
ట్రంప్ ఆవేదన: రష్యా, చైనాలు ఆ పని చేస్తే…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనలు పూర్తిగా తప్పుకున్నాయి. 2001 నుంచి 2021 వరకు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సమకూర్చింది. ఇందులో అధునాతనమైన 73 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దళాలు బయటకు వచ్చే సమయంలో కొన్నింటని వెనక్కి తీసుకొచ్చారు. కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన వాటిపై అమెరికా అందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా వదిలేసి వచ్చిన… -
వైరల్: ఆ ముసలాయన స్కైటింగ్ స్కిల్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే…
స్కేటింగ్ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్లు చేతులు విరిగిపోతాయి. చిన్నపిల్లలు, యువత ఎక్కువగా ఈ గేమ్‌ను అడుతుంటారు. అయితే, రష్యాకు చెందిన 73 ఏళ్ల ఇగోర్ అనే పెద్దమనిషి స్కేటింగ్ లో తన స్కిల్స్‌ను ప్రదర్శించి భళా అనిపించాడు. 73 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ఇగోర్ తన ప్రతిభను ప్రదర్శించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది. ప్రతిభకు… -
ఏపీ అధికార పార్టీ శిబిరంలో అలజడి రేపుతున్న ప్రజాప్రతినిధుల జల్సాలు…!
జల్సారాయుళ్లు..! ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్. మంత్రి బాలినేని రష్యా టూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇదేతరహాలో ఎంజాయ్ చేస్తున్న మరికొందరిపై ఫోకస్ పడింది. ప్రభుత్వవర్గాలు ఆరా తీస్తున్నాయట. అలా తీగకు తగిలిందే.. గోవా టూర్..! అధికారపార్టీ శిబిరంలో అలజడి రేపుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బాలినేని రష్యా టూర్‌పై చర్చ ఆగలేదు.. తెరపైకి మరో పర్యటన! ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రష్యా టూర్ ఓ హాట్‌టాపిక్. విలసవంతమైన ప్రైవేట్ జెట్‌లో రష్యా… -
నేడు భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు… దీనిపైనే చర్చ…
ఈరోజు నుంచి 13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. అయితే, కరోనా కారణంగా ఈ సదస్సును వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ఈరోజు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. గతంలో 2012, 2016లోనూ ఇండియా ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది. ఈ 13 వ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కరోనా, ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలనపై వస్తున్న విమర్శలు, అక్కడి ప్రజకు అందించాల్సిన చేయూత తదితర విషయాలపై… -
అప్ఘన్ తో కశ్మీర్ కు ముప్పు.. రష్యాకూ ప్రమాదమే?
ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను మాత్రమే ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ కూడా భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారబోతున్నాయి. ఉగ్రవాదంపై తొలి నుంచి పోరాడుతున్న భారత్ కు తాలిబన్లు కంట్లో నలుసుగా… -
తాలిబన్ల కోసం రంగంలోకి దిగిన రష్యా… వారితో చర్చలకు సిద్ధం…
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా… -
తాలిబన్ నేతలతో రష్యా రాయబారి సమావేశం…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి… -
ఈ వ్యాక్సిన్.. డెల్టా వేరియంట్‌పై 83 శాతం సమర్థంగా..!
కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి..…
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?