Arshdeep Singh: మై పర్సన్.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన అర్ష్‌దీప్ సింగ్.. సమ్రీన్ కౌర్ ఎవరు?
- భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్
- ప్రేమ సంబంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు
- సమ్రీన్ కౌర్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన ప్రేమ సంబంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నటి, మోడల్ సమ్రీన్ కౌర్ తో కలిసి దిగిన రెండు ఫోటోలను పంచుకుంటూ “My Person” అనే క్యాప్షన్ ఇవ్వడంతో గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న డేటింగ్ వార్తలకు తెరపడింది. ఈ పోస్టుకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
సమ్రీన్ కౌర్ ఎవరు?
సమ్రీన్ కౌర్ 1999 సెప్టెంబర్ 7న జమ్మూ కశ్మీర్లో జన్మించారు. ఆమె పుణెలోని సింబయోసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ నుంచి బీకాం (ఆనర్స్) పూర్తి చేశారు. చదువు అనంతరం మోడలింగ్, నటన రంగంలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించి ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఆ పోటీ ద్వారా ఆమెకు మోడలింగ్ అవకాశాలు లభించగా, తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు
సమ్రీన్ కౌర్ ZEE5 వెబ్ సిరీస్ ‘నెయిల్ పాలిష్’లో నటించారు. అలాగే ’83’, ‘సర్దార్ జీ 2’ వంటి చిత్రాల్లో కూడా కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ గాయకులు జుబిన్ నౌటియాల్, బాద్షా, గురు రంధావాలతో కలిసి రూపొందిన పలు మ్యూజిక్ వీడియోల్లో నటించారు. ముఖ్యంగా ‘బావ్లా’, ‘తుఝే భూల్నా తో చాహా’ వంటి పాటలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సమ్రీన్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె తన ఫ్యాషన్, ట్రావెల్, ప్రొఫెషనల్ అప్డేట్స్ను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అర్ష్‌దీప్ సింగ్‌తో ప్రేమ కథ ఎలా బయటపడింది?
ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సమ్రీన్ కౌర్, అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనిపించిన ఒక స్నాప్‌చాట్ ఫోటో వైరల్ కావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అలాగే ఇద్దరి సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించిన టాటూలు, దుస్తులు, యాక్సెసరీలను అభిమానులు పోల్చి చూస్తూ వారు రిలేషన్షిప్లో ఉన్నారని ఊహించారు.
ఇదే సమయంలో సమ్రీన్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు పలుమార్లు హాజరయ్యారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో పాటు చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లలో కూడా ఆమె జట్టును ప్రోత్సహిస్తూ కనిపించారు. దీంతో ప్రేమ వార్తలు మరింత బలపడ్డాయి. చివరకు అర్ష్‌దీప్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్‌తో కలిసి ఫోటోలను పంచుకోవడంతో ఇద్దరి ప్రేమ బంధం అధికారికమైంది.
ఆశిష్ చంచలానితో గతంలో ప్రచారం
గతంలో సమ్రీన్ కౌర్ పేరు ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానితో కూడా వినిపించింది. అయితే ఇద్దరూ తాము మంచి స్నేహితులమే తప్ప ప్రేమలో లేమని స్పష్టం చేశారు. అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల తమ స్నేహంలో మార్పులు వచ్చినప్పటికీ, ఒకరిపై ఒకరికి పరస్పర గౌరవం కొనసాగుతోందని సమ్రీన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!