Indians are Talented, Driven People, Putin’s Big Praise: భారతదేశంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారతదేశానికి అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా ఉంది రష్యా. అనేక సార్లు భారతదేశానికి అండగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. యుద్ధం నేపథ్యంలో రష్యాపై వెస్ట్రన్ దేశాలు అనేక ఆంక్షలు విధించినా కూడా భారతదేశం, రష్యాతో తన బంధాన్ని కొనసాగిస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురును కొనుగోలు చేస్తోంది.
Read Also: China Spy Ship: భారత్‌పై నిఘా కోసం చైనా గూఢచారి నౌక .. క్షిపణి ప్రయోగానికి ముందు ఘటన
నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ కీలక ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని.. అభివృద్ధిని నడిపేవారు అని అన్నారు. భారతదేశం అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. భారతదేశం అభివృద్ధి పరంగా అత్యుత్తమన ఫలితాలను సాధిస్తుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని.. ఒకటిన్నర బిలియన్ జనాభా ఉన్న భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రశంసించారు. భారతదేశాన్ని చూద్ధాం.. ప్రతిభవంతులైన వారు.. అభివృద్ధి వైపు నడిపే ప్రజలు ఉన్నారని అన్నారు.
రష్యా నాగరికత, సంస్కృతిపై, ఆఫ్రికాపై పాశ్చాత్య దేశాల దోపిడి గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు. ఆఫ్రికాను కొల్లగొట్టిన విషయాన్ని యూరప్ పరిశోధకులు దాచలేరని విమర్శించారు. ఆఫ్రికన్ ప్రజలు బాధలు, శోకాలపై వారు అభివృద్ధి చెందారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఒక గొప్ప రాజ్యమని..బహూళ జాతి దేశమని.. యూరోపియన్ సంస్కృతిలో భాగం అని ఆయన అన్నారు. గతంలో కూడా భారత దేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్. భారతదేశాన్ని దోచుకోవడంపై, ఇక్కడి ప్రజలపై యూకే వంటి యూరోపియన్ రాజ్యాలు చేసిన అకృత్యాలపై విమర్శలు గుప్పించారు. అంతకుముందు అక్టోబర్ 27న భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు పుతిన్. ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడని అన్నారు. ప్రపంచంలో తన దేశం, తన ప్రజల కోసం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మోదీ అనుసరిస్తున్నారని.. అతడిని ఆపేందుకు పాశ్చాత్య దేశాలు అనేక ప్రయత్నాలు చేశాయని పుతిన్ అన్నారు.