భారత్కు చిరకాల మిత్రదేశమైన రష్యా అంతర్జాతీయ వేదికపై మరోసారి బాసటగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది.
Russia-Ukrain War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందరో సామాన్యుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకరకంగా ఈ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పలు దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపడంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల భారత్ లాభపడిందని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా దగ్గర డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంతో…
రష్యాలోని గబ్బిలాలలో మరో వైరస్ 'ఖోస్టా-2'ను పరిశోధకులు కనుగొన్నారు, ఇది మానవులకు సోకుతుందని చెప్పారు. టైమ్ మ్యాగజైన్లోని ఒక నివేదిక ప్రకారం.. మానవ జనాభాకు సమస్యలను కలిగించే వైరస్ను పరిశోధకులు రష్యన్ గబ్బిలాలలో కనుగొన్నారు.
Russian Youth leave nation due to new war plans: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పాక్షిక సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ వైపు మరింత మంది సైనికులను తరలించనున్నట్లు తెలుస్తోంది. తమ భూభాగాలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని.. అణుబాంబు వేసే సమయం వచ్చిందని..దీన్ని అమెరికా, దాని మిత్ర రాజ్యాలు డ్రామాలు…
putin orders partial mobilization of citizens: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధబలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న వైద్య విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. యూరో వీక్లీ న్యూస్ ఈ విషయాలను వెల్లడించింది. పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు బుధవారం జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ ఈ సమాచారాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. అయితే ఈ హత్యాయత్నం ఎప్పుడు జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడికి పాల్పడుతున్నప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని.. అతని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.