America: రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తోందనే సంకేతాలు అమెరికాకు కనిపించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం అన్నారు. అలాంటి రష్యా చర్చల గురించి ఎలాంటి సంకేతాలు లేవన్నారు. అణ్వాయుధాల వినియోగం గురించి రష్యా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని కిర్బీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మొదటి నుంచి స్పష్టంగా ఉన్నామని.. వాటిని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు ఎటువంటి సూచన లేదన్నారు.
ఇటీవల రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందనే వార్తలు సంచలనం రేపాయి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ దేశమే తమపై అణు దాడి చేయడానికి సిద్ధమైందని ఆరోపించింది. ఐరోపాలోని అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అయితే.. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు రెడీ అవుతోందని రష్యా పేర్కొంది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో అణుబాంబు ప్రయోగించి.. ఆ నేరాన్ని తమ మీద మోపేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నుతోందని రష్యా చెప్పుకొచ్చింది. ఈ కుట్రను గుర్తించే తాము తమ బలగాల్ని ఖాళీ చేయిస్తున్నామని కూడా తెలిపింది. కానీ.. నాటో దేశాలు మాత్రం రష్యా ఆరోపణల్ని ఖండించాయి. రష్యా అనవసరమైన ఆరోపణలు చేస్తోందని, ఉక్రెయిన్‌పై తమ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకే ఈ తప్పుడు ఆరోపణలకు దిగిందని పేర్కొన్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కూడా మంగళవారం స్పందిస్తూ.. ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే, రష్యా క్షమించరాని తప్పిదం చేసినట్లే అవుతుందని హెచ్చరించారు.
Sachin Pilot: తిరగబడ్డ ఎమ్మెల్యేలందరినీ శిక్షించాలి.. సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుండగా.. క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేసినప్పటి నుంచి రష్యా ఆ దేశంపై భీకర దాడులకు దిగిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై దాడికి దిగింది. రాజధాని కీవ్‌తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసింది. ఈ దాడుల కారణంగా 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది.