RUSSIA UKRAINE WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ దేశం తగ్గేదేలే అన్నట్లు పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టింది.
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను…
క్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది.
ఓ పౌరకాన్వాయ్పై రష్యా దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 30 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. దాదాపు 88 మంది గాయపడ్డారు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు…
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ…
క్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రాంతాలు రష్యాలో శుక్రవారం విలీనం అవుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం ప్రకటించారు.
Russian youth fleeing to neighboring countries: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మరింత సైనికులను సమీకరించాలని పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రష్యాలో గతంలో మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్న వారు, శిక్షణ పొందిన వారు యుద్ధంలోకి బలవంతంగా చేరేలా పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ నిర్ణయంతో రష్యా యువతలో భయాందోళనలు ఏర్పడ్దాయి. దీంతో పెద్ద ఎత్తున రష్యా యువకులు…
Russia School Shooting: రష్యాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు స్కూల్ లో విచక్షణారిహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు తనను తాను చంపుకున్నాడు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన 13 మందిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ వెల్లడించారు.