Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు.
వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు:
రెండో టీ20లో 44 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ చాలా తెలివైన ఆటగాడు. ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానంలో ఎలా ప్రవర్తించాలో, మైదానం బయట ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వచ్చిన నేపథ్యం కారణంగా చుట్టూ ఎన్నో ఆకర్షణలు, దృష్టి మళ్లించే అంశాలు ఉంటాయి. నేను కూడా అదే పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి వాటి ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని ఇషాన్ తెలిపాడు.
Also Read
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
బయట విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం:
వైభవ్ సోషల్ మీడియా, బయట జరుగుతున్న ప్రచారం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండేలా భారత జట్టు ప్రయత్నిస్తోందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ‘నేను మాత్రమే కాదు.. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, జట్టులోని ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా వైభవ్‌తో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని చెబుతున్నాం. ప్రస్తుతం అతను పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి. సోషల్ మీడియాలో ఏమి జరుగుతోంది, బయట ఎవరు ఏమంటున్నారు అనే విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం. ఒకవేళ పరుగులు చేయకపోయినా నిరాశ చెందకుండా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటాం’ అని పేర్కొన్నాడు.
చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు:
వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని ఇషాన్ కిషన్ ప్రశంసించాడు. ‘వైభవ్ లాంటి బ్యాటర్ పవర్‌ప్లేలో క్రీజులో ఉంటే తొలి ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 నుంచి 90 పరుగులకు వెళుతుంది. అలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు. అందుకే మేమంతా అతనికి అన్నల్లా అండగా నిలుస్తున్నాం. మేము మా కెరీర్ ప్రారంభంలో చేసిన తప్పులను అతను చేయకుండా చూసుకోవడమే మా బాధ్యత. మానసికంగా, శారీరకంగా సరైన దారిలో ముందుకు వెళ్లేలా సహాయం చేస్తున్నాం. వైభవ్ ఎప్పుడూ సంతోషంగా క్రికెట్ ఆడుతూ తన ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..