Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా బయట అడుగుపెట్టాడు. ఇటీవల కిర్గిజ్స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన పుతిన్ అటునుంచి అటుగా చైనా పర్యటనకు వెళ్లాడు. చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)" ప్రాజెక్టు ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లారు. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, పుతిన్ కి సాదరస్వాగతం పలికారు.
Russia: ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణుపరీక్షలపై రష్యా చట్టపరమైన వైఖరిని మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గతంలో పుతిన్ తన అభిప్రాయాన్ని చెప్పిన విధంగానే ‘‘అణు పరీక్ష నిషేధ ఒప్పందం’ రద్దు చేసేందుకు రష్యా పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Putin: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ రష్యా వెలుపల ఇతర దేశాల పర్యటనలకు వెళ్తున్నాడు. ఇటీవల కిర్గిజ్స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చైనా ఘనస్వాగతం పలికింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
Arms Treaty: రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి నార్త్ కొరియాతో పొత్తుపెట్టుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలవనుందా.? దీనిపైనా US ఏమంటుంది? అనే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. వివరాలలోకి వెళ్తే అధునాతన సాంకేతికతతో ఆయుధాలను…
Modi-Putin: భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యన్ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ..
Russia: రష్యా-ఉత్తర కొరియాల మధ్య ఏదో పెద్దగానే జరుగుతోంది. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాల మధ్య ఆయుధాల డీల్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్-పుతిన్ భేటీ తర్వాత రష్యా-ఉత్తర కొరియాల మధ్య రైళ్ల రాకపోకలు పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య ట్రైన్ ట్రాఫిక్ పెరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి.
Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.