Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
Putin: చైనా, రష్యా దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును తప్పుపడుతున్నాయి. మరోవైపు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇదే విధంగా చైనాతో అమెరికా సంబంధాలు పూర్తిగా దిగజరాయి. మరోవైపు యూరోపియన్ దేశాలకు కూడా చైనా అంటే నమ్మకం సన్నగిల్లింది. కోవిడ్ తర్వాత చైనాతో అరకొర సంబంధాలను కంటిన్యూ చేస్తున్నాయి ఆయా దేశాలు.
Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. అయినా ఎక్కడా తగ్గకుండా కిమ్ నార్త్ కొరియా నుంచి తన ప్రత్యేక రైలులో రష్యా వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా కిమ్ దేశాన్ని వదిలి రష్యా పర్యటనకు…
Russian Sellers Stop Fertilizers Discounts to India: డీఏపీ, యూరియా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ కు ఎరవులు సరఫరా చేయడంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న రష్యా సప్లైను కఠినతరం చేసింది. ప్రపంచ దేశాలకు చైనా కూడా ఎరువులను అందించేది. అయితే చైనా వీటి సరఫరాను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ దిగింది. దీంతో రష్యా మార్కెట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను…
Kim Jong Un: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఒత్తిడిని లెక్క చేయకుండా ఉత్తకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కానున్నారు. కిమ్ తన ప్రత్యేక రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాలో వ్లాదివోస్టోక్కి ఆదివారం వెళ్లారు.
Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
Russia-Ukraine War: గత ఏడాదిన్నరగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ కు రెండిన తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహింస్తోంది రష్యా. డోనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో రష్యా శుక్రవారం ఎన్నికలను ప్రారంభించింది. ఆదివారంతో ఇవి ముగియనున్నాయి. ఇదిలా ఉంటే రష్యా చర్యను వెస్ట్రన్ దేశాలు ఖండిస్తున్నాయి.
Russia: దీర్ఘకాలంగా జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.