ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చేయాల్సిందంతా చేస్తోంది. ఆపరేషన్ గంగ అంటూ స్పెషల్ విమానాలు వంటివి ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను ఇక్కడ కూడా…
కొన్నిరోజులుగా అగ్రదేశం రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా దాడుల కారణంగా ఆ దేశం భారీగా నష్టపోతోంది. దీంతో ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సాయంలో 350 మిలియన్ డాలర్లు…
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు…
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు సాగుతూనే ఉన్నాయి… రెండో దశల్లో చర్చలు విఫలం అయ్యాయి.. ఇక, మంగళవారం రోజు మూడో దఫా చర్చల్లో కాస్త పురోగతి కనిపించింది.. మూడో దఫా శాంతి చర్చలు కూడా ఎటూ తేలకుండానే ముగిసినట్టు చెబుతున్నారు.. బెలారస్ వేదికగా మూడోసారి సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు… ఎలాంటి ముందడుగు వేయలేకపోయారని అంటున్నా.. చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు.. అయితే, చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని ఉక్రెయిన్…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.15, డీజిల్ రూ.22 మేర పెరగనున్నాయని ఐఏఎన్‌ఎస్ రిపోర్ట్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న చమురులో 80 శాతం దిగుమతుల…
ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు పుతిన్ సూచించారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ…
ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 15 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న వలస సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డోవాలోకి…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి పది రోజులైంది. పుతిన్ బలగాలను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు కలిసికట్టుగా ఎదిరిస్తున్నారు. అయినా ప్రత్యర్థి దేశంలోని ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇంకా అమెరికా, నాటోపై ఆశ చావలేదు. ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం సృష్టిస్తూనే రష్యా మరోపక్క చర్చలు జపం చేస్తోంది. రష్యా చర్యను ఇప్పటికే మెజార్టీ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితి వేధికగా దాడిని…
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్ ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క…