ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య సమావేశం ముగిసింది. బెలారస్ వేదికగా సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని, రష్యా సైన్యం తమ దేశం నుంచి వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అటు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఈ డిమాండ్లకు ఇరుదేశాలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలంగా ముగిశాయి. ఒక్క…
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ సైనం. ప్రజలు సైతం… ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడి కక్కడ రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. రష్యా దాడికి నిరసనగా రోడ్లపై నిరసన…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా మెట్రో స్టేషన్‌లనే బంకర్లుగా…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు సమంత, కాజల్ అగర్వాల్ వంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సమంతా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ…
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మారనుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దానికి…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్. Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ…
ఉక్రెయిన్‌పై రష్యా భీకరస్థాయిలో యుద్ధం చేస్తోంది. దీంతో ప్రజలు భయంతో అల్లాడుతున్నారు. అయితే రష్యా మొదటి లక్ష్యం తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము ఉక్రెయిన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు పోరాడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘మనతో కలిసి యుద్ధం…
రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. అయితే, రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా తమపై…
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా… రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. కీవ్‌ను చుట్టుముట్టాయి రష్యా బలగాలు, కీవ్‌కు వెళ్లే రోడ్లు అన్నింటినీ దిగ్బంధించాయి రష్యా సేనలు… ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.. ఇప్పటి వరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా.. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్పౌరులు మృతిచెందినట్టుగా చెబుతున్నారు..…