Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయనకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని పలు నివేదికలు కూడా వెలువడ్డాయి. తాజాగా, మరోసారి పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆయన కుడి చేతి వాపుగా ఉందని ఈ వీడియో చూపిస్తోందని న్యూస్ వీక్ నివేదించింది. Read Also: True 8K వీడియో…
Finland: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు.
Trump: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తోందని అన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.
Russia Ukraine War: ఒకప్పుడు ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అందుటో ఒక ధృవం పేరు యూఎస్ఎస్ఆర్.. ఇది 1990 విచ్ఛిన్నం అయ్యింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయ్యి చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 15 దేశాలుగా విడిపోయింది. భౌగోళిక విస్తీర్ణం పరంగా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఇంతకీ మాస్కో పసి కూనపై ఎందుకు ఇంత పగ పట్టాల్సిన అవసరం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి అసలు కారణం ఏంటి.…
Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక…
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
Russia: నిజంగా రష్యా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ‘జపాడ్-2025’ సైనిక విన్యాసాల సందర్భంగా మాస్కో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటైన హైపర్సోనిక్ కింజాల్ క్షిపణిని విజయవంతం పరీక్షించింది. ఈ క్షిపణి వేగం ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ. దీనిని ఆపడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ కథనం ప్రకారం.. ఈ క్షిపణిని రష్యా మిగ్-31 ఫైటర్ జెట్‌లలో అమర్చారు. ఈ విమానాలు బారెంట్స్ సముద్రం మీదుగా…
Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య అలాస్కలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు. దీంతో రష్యా- ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొంటుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. గత మూడేళ్ల…