ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు ప్రకటించాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్రాండ్‌లు ఇప్పుడు రష్యాలో కనిపించడంలేదు. అనేక షాపింగ్ మాల్స్, బ్రాండ్ స్టోర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా మారబోతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌తో ఓవైపు చర్చలు.. మరోవైపు యుద్ధం కొనసాగిస్తూనే ఉంది రష్యా.. నిన్న జరిగిన మూడో దఫా చర్చలు కూడా విఫలం అయిన సంగతి తెలిసిందే కాగా.. కాకపోతే కొంత ముందడుగు పట్టినట్టు చెబుతున్నారు.. మరో రెండు రోజుల్లో నాల్గో విడుత చర్చలు జరగబోతున్నాయి. మరి అప్పుడైనా.. యుద్ధాన్ని ఆపే నిర్ణయాలు ఉంటాయా? అనేది వేచిచూడాల్సిన విషయమే.
Read Also: Komatireddy: రేపటి కేసీఆర్ ప్రకటన కోసం వేచి చూస్తున్నా..!