ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు సాగుతూనే ఉన్నాయి… రెండో దశల్లో చర్చలు విఫలం అయ్యాయి.. ఇక, మంగళవారం రోజు మూడో దఫా చర్చల్లో కాస్త పురోగతి కనిపించింది.. మూడో దఫా శాంతి చర్చలు కూడా ఎటూ తేలకుండానే ముగిసినట్టు చెబుతున్నారు.. బెలారస్ వేదికగా మూడోసారి సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు… ఎలాంటి ముందడుగు వేయలేకపోయారని అంటున్నా.. చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు.. అయితే, చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని ఉక్రెయిన్ ప్రతినిధి ప్రకటించగా… రష్యా ప్రతినిధి మాత్రం… తమ అంచనాలను రీచ్ కాలేకపోయామని పేర్కొనడం చర్చగామారింది.
Read Also: AP: మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ..! వైసీపీ ఎమ్మెల్యే ఆశ్చర్యం
అయితే, మరోసారి రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.. గురువారం టర్కీ వేదికగా నాల్గో విడత శాంతి చర్చలకు కూర్చోనున్నారు.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయున భారతీయులు, ఇతర దేశాల పౌరులను సురక్షిత తరలింపు మార్గాల ద్వారా ( హ్యుమనిటోరియన్ కారిడార్స్) ఏర్పాటుపై రష్యా-ఉక్రెయిన్ అంగీకారం తెలిపాయి.. రష్యా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ కూడా ఆమోదం తెలిపింది.. మూడోరౌండ్ చర్చల్లో ముఖ్యంగా ఉక్రెయిన్ నగరాల నుంచి మానవతా కారిడార్ల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించారు. తొలి విడత బృందం తరలింపు ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం అయ్యింది.. అయితే, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరుల తరలింపుకు రష్యా వల్లే జాప్యం జరగుతోందని విమర్శించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.