ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం…
రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. ఒకటి పుతిన్.. రెండోది జెలెన్ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆయన రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ జెలెన్ స్కీ గురించే చాలా మందికి తెలియదు. నిజానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్‌స్కీ ఒక బిజీ నటుడు. పలు సినిమాలు టీవీ సిరీస్‌లలో హాస్య పాత్రలు పోషించారు.…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.…
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,…
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్‌పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది.…
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది… ఇక, అదే స్థాయిలో ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.. కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్‌లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో…
కరోనా మహమ్మారి ఎంట్రీ సమయంలో… లాక్‌డౌన్‌లు, కట్టడి చర్యల కారణంగా దారుణంగా పడిపోయిన కూడాయిల్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది.. ఆ యుద్ధం ప్రభావం ఇప్పుడు ముడిచమురుపై పడుతోంది.. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది.. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. మరోవైపు.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్ దేశాలు చమురు…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు…
పిల్లి, ఎలుక కొట్టుకుంటుంటే మన పెద్దలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను మనం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు అన్వయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. మరోవైపు నిత్యావసరాల…
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. భారత విద్యార్థి నవీన్ ఆహారం…