Yevgeny Prigozhin: వాగ్నర్ కిరాయి సైన్యానికి చీఫ్‌గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.
Russia: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. రాజధాని సమీపంలో ఐదు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ చర్యకు అమెరికా, నాటోనే కారణం అని.. వీటి సాయం లేకుండా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులు సాధ్యం కాదని రష్యా ఆరోపించింది.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్‌ను మంగళవారం రెండు రష్యా క్షిపణులు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు. మొదటి క్షిపణి రెస్టారెంట్‌ను తాకింది, గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.