దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, గత రాత్రి ఉక్రెయిన్ రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. రష్యా రక్షణ వ్యవస్థలు క్రిమియాపై 16 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేశాయి.
48 ఏళ్ల వయసున్న పొలిట్‌కోవ్‌స్కాయాను మాస్కోలోని ఆమె అపార్ట్మెంట్ బ్లాక్ లోని లిఫ్టులో కాల్చి చంపారు. ఆమె ఇండిపెండెంట్ నోవాయా గెజిలా వార్తా పత్రికకు పనిచేసేది. ఈ హత్యలో శిక్ష అనుభవిస్తున్న వారిలో ఖడ్జికుర్బనోవ్ ఒకరు. ఆమె గతంలో చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ అట్రాసిటీలను ఖండిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించింది.
బ్రిటిష్ సైనిక కార్గో విమానం రావల్పిందిలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూన్ ఖాన్ నుంచి సైప్రస్, అక్రోతిరిలోని బ్రిటిష్ సైనిక స్థావరానికి, అక్కడి నుంచి రోమేనియాకు వెళ్ళింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేసేందుకు మొత్తం ఐదుసార్లు ఇలా వెళ్లినట్లు బీబీసీ ఉర్దూ సోమవారం నివేదించింది. అయితే పాక్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఉక్రెయిన్‌కి గానీ, దాని పక్క దేశం రొమేనియాకు కానీ ఎలాంటి ఆయుధాలను అందించలేదని చెప్పింది.
Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుండెపోటుతో పుతిన్ మంచంపై నుంచి పడిపోయినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా బయట అడుగుపెట్టాడు. ఇటీవల కిర్గిజ్‌స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన పుతిన్ అటునుంచి అటుగా చైనా పర్యటనకు వెళ్లాడు. చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)" ప్రాజెక్టు ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, పుతిన్ కి సాదరస్వాగతం పలికారు.
Russia: ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణుపరీక్షలపై రష్యా చట్టపరమైన వైఖరిని మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గతంలో పుతిన్ తన అభిప్రాయాన్ని చెప్పిన విధంగానే ‘‘అణు పరీక్ష నిషేధ ఒప్పందం’ రద్దు చేసేందుకు రష్యా పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Putin: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ రష్యా వెలుపల ఇతర దేశాల పర్యటనలకు వెళ్తున్నాడు. ఇటీవల కిర్గిజ్‌స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చైనా ఘనస్వాగతం పలికింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.