రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు పేర్కొంది.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది.
India becomes Europe's largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల…
రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Russia: ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత పలువురు అధికారులు, పుతిన్ కు సన్నిహితులు, ఆయన్ను వ్యతిరేకించిన వారు వరసగా అనుమానాస్పద మరణాలకు గురువుతున్నారు. తాజాగా పుతిన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు ఒకే రోజు మరణించడం చర్చనీయాంశం అయింది. అధికార యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన స్టేట్ డూమా డిప్యూటీలుగా పనిచేస్తున్న ఇద్దరు రష్యన్ అధికారులు ఆదివారం మరణించారని న్యూస్ వీక్ నివేదించింది.
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్‌లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన స్లోవియన్స్క్‌లోని నివాస ప్రాంతంపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో 8 మంది మరణించినట్లు తెలిపింది. రష్యాకు చెందిన ఏడు ఎస్-300 క్షిపణులు బఖ్‌ముట్ నగరానికి పశ్చిమాన ఉన్న స్లోవియన్స్క్‌పై దాడి చేశాయి.