ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు అందిరినీ టెన్షన్ పెడుతోంది.. ఇది మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అణు యుద్ధం తప్పదా? అనే అనుమాలు కూడా ఉన్నాయి… అయితే, ఈ యుద్ధం కారణంగా చాలా మంది భారతీయులు మరీ ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది… ఇక, ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగా స్పందించే భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా.. ఈ యుద్ధ సమయంలో ఓ సరికొత్త…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలను కూడా రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం చేస్తోంది.. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ఇప్పటికే ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదులుతోంది.. ఇక, యుద్ధంపై కీలక…
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది. Read Also: Zain Nadella:…
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను క్రమంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, వచ్చే వారం ఐక్యరాజ్య సమితి సాధారాణ సభలో ఓటింగ్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరగబోతోంది.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ ఉండనుంది.. అయితే, రెండోసారి కూడా తటస్థ వైఖరినే అవలంభిస్తోంది భారత్.. ఇక, ఐక్యరాజ్య సమితిలోని 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది…
ఉక్రెయిన్‌లో ఆరో రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. మరో రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ నగానికి 40 మైళ్ల దూరంలో రష్యా మిలెట్రీ కాన్వాయ్ ఉంది. దీనిపై శాటిలైట్ ఫోటోలు విడుదలయ్యాయి.. పుతిన్ సేనలు ఏమాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ…
రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. మరోవైపు.. ఇప్పటికే తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా.. రష్యాతో చర్చలకు అంగీకారం తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కాగా, బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించింది. చర్చల కోసం బెలారస్‌కు ఉక్రెయిన్ బృందం బయలుదేరింది.…
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం నాల్గో రోజుకు చేరుకోగా..మూడోరోజు ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యా సైన్యం… మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. సిటీల్లోకి ట్యాంకులు చొచ్చుకెళ్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఉన్నది కొద్ది పాటి సైన్యం. రష్యాకున్నంత ఆయుధ సంపత్తి లేదు. అయినా ఉక్రెయిన్ సైనికులు వెన్నుచూపడం లేదు. ప్రపంచంలోనే ఓ అమేయశక్తి నేరుగా దాడి చేస్తున్నా.. మాతృభూమిని రక్షణలో ప్రాణాలర్పిస్తున్నారు. మా ప్రాణమున్నంతవరకూ మా మాతృభూమిని ఆక్రమించలేరంటూ… పోరాట…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు..…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్‌లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని…
ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఉక్రెయిన్‌ను మొత్తం స్వాధీనం చేసుకునే విధంగా ముందుకు కదులుతుంది రష్యా.. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు పరిపోయినట్టు వార్తలు వచ్చినా.. తాను ఎక్కడి పోలేదు.. ఇక్కడే ఉన్నా.. పోరాటం చేస్తా.. తనకు ఆయుధాలు కావాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు అంత సులువుగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఏమీ లేనట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యాకు కూడా భారీ నష్టమే జరుగుతోంది.. Read Also: Helicopter…