Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇరు దేశాలు కూడా ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గతేడాది ఫిబ్రరి 24 న ప్రారంభమైన ఉక్రెయిన్ వార్ లో ఇప్పటి వరకు 9000 మంది పౌరులు మరణించారని తెలిపింది. ఇందులో 500 మంది చిన్నారులు చంపబడ్డారని యూఎన్ మానవహక్కుల పర్యవేక్షణ మిషన్(HRMMU) శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Maruti Suzuki Ignis : కేవలం 12 వేలకే.. మారుతీ కారు.. ఫీచర్లు వింటే షాక్ అవ్వాల్సిందే
ముఖ్యంగా ఉక్రెయిన్ పౌరులు ఎక్కువగా చనిపోయారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య తక్కువగా ఉంది.. అయితే మే, జూన్ నెల్లో మళ్లీ యుద్ధంలో మరణించేవారి సంఖ్య పెరిగినట్లు యూఎన్ పేర్కొంది. జూన్ 27న తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్‌పై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది పౌరులు మరణించారు. శుక్రవారం పశ్చిమ నగరమైన ఎల్వీవ్ పై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున దాడిలో కనీసం 37 మంది గాయపడ్డారు.
రష్యా క్రమంగా ఉక్రెయిన్ పై వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుంది. రష్యా దాడుల్లో కీవ్, ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, జపొరోజ్జియా, ఎల్వీవ్ వంటి నగరాలు దారుణంగా ధ్వంసం అయ్యాయి. వందల్లో ప్రజలు చనిపోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని మౌళిక సదుపాయాలైన తాగునీరు, డ్రైనేజ్, కరెంట్ సౌకర్యాలపై రష్యా దాడులు చేస్తోంది. బూచా, మరియోపోల్ వంటి నగరాల్లో గతేడాది రష్యా దురాగతలాలకు పాల్పడింది.