India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక…
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Indians are Talented, Driven People, Putin's Big Praise: భారతదేశంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారతదేశానికి అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా ఉంది రష్యా. అనేక సార్లు భారతదేశానికి అండగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. యుద్ధం నేపథ్యంలో రష్యాపై వెస్ట్రన్ దేశాలు అనేక ఆంక్షలు విధించినా కూడా భారతదేశం, రష్యాతో తన బంధాన్ని కొనసాగిస్తోంది. రష్యా నుంచి…
India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది
Ukraine Sought Pakistan’s Help For Developing Nuclear Weapons: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాలను అభివృద్ధి కోసం ఉక్రెయిన్, పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లినట్లు రష్యా సెనెటర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
Union minister snubs journalist on India's Russian oil purchase: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కొనుగోళ్లపై భారత్ కు రష్యా డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఇదిలా ఉంటే భారత్ ఈ చర్యపై యూరోపియన్ దేశాలు, అమెరికా నిరసన వ్యక్తం చేస్తున్నాయి.…