Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ.. 24 గంటల్లో 1000 మంది సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై 8 నెలలగా విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఉక్రెయిన్ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై కీవ్ సేనలు ప్రతిదాడులకు దిగాయి. సరైన ఆయుధాలు లేని రష్యా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేసింది. రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు 24 గంటల వ్యవధిలో 1000 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు తెలుస్తోంది. సరైన ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలోకి వచ్చిన రష్యా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక, రష్యా ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 71,200 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు వెల్లడించింది.
వీరిలో చాలా మంది రిజర్విస్టులే కావడం గమనార్హం. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని ఇటీవల బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాల నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సేనలు వారిపై దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక మంది రిజర్విస్టులను వెనక్కి పిలిపించి ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపించారు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
Extramarital Affair: ప్రియుడి మోజులో భర్తని చంపించింది.. 24 గంటల్లోనే బుక్కైంది
ఇదిలావుండగా.. క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేసినప్పటి నుంచి రష్యా ఆ దేశంపై భీకర దాడులకు దిగిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై దాడికి దిగింది. రాజధాని కీవ్‌తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసింది. ఈ దాడుల కారణంగా 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. కొన్ని రోజుల కిందట పదుల సంఖ్యలో క్షిపణులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో కీవ్‌లో అంధకారం నెలకొంది, తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, కొన్నిరోజుల వ్యవధిలోనే కీవ్ లో విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..