దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్‌పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.
Ukraine in the dark. Russian attack on power system: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా రష్యా దాడుల ఫలితంగా ఉక్రెయిన్ లో అంధకారం నెలకొంది. దేశంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కోటి మంది ఉక్రెయిన్లకు విద్యుత్ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం అన్నారు. ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాలు…
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది.…
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
Ukrainians celebrate Russia’s retreat from Kherson: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చేతులెత్తేస్తోంది. గతంలో స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్నాయి. గతంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిగిరిగాయి. దీంతో ఉక్రెయిన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నెల క్రితం రష్యా ఉక్రెయిన్ లోని ఖేర్సన్, లూహన్స్క్, డోనెట్స్క్,…
S Jaishankar Meets Ukraine Minister To Discuss Ways To End Russia War: కంబోడియా వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో భేటీ అయ్యారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలను చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం జైశంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. కంబోడియా రాజధాని నమ్ పెన్ లో జరుగుతన్న…
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ' ఖేర్సన్ మాదే' అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది.