రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
యుద్ధాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలపై రోజుకో మాట మారుస్తున్నారు. గురువారం టెక్ సీఈవోలతో భేటీ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకొచ్చారు.
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్స్కీ, పశ్చిమ దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు.
చైనాలోని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు.
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.
రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.