శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా.. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
కోల్‌కతాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎయిర్‌పోర్టులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో భారీ ఎత్తున విమానాశ్రయంలో నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం అక్కడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు…
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు ఒకే విమానాశ్రయంలో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అది కూడా కేవలం ఒక్క గంట వ్యవధిలోనే రన్‌వే పై అదుపు తప్పిపోయాయి.
ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు.
చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని చాంగ్‌కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళ్తున్నది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్‌కింగ్ ఎర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు. కాగా..ల్యాండింగ్ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది.…