Delhi Airport: రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అధికారులు వెల్లడించారు. రెండూ.. విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానాలే కావడం గమనార్హం. ఆ రెండు విమానాల్లో ఒకటి టేకాఫ్ తీసుకోనుండగా, మరొకటి ల్యాండింగ్‌కు సిద్ధమైంది.
Read Also: Chandrayaan-3: ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళ్తున్న విమానం యూకే725 టేకాఫ్ తీసుకోనుండగా, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం రన్‌పై ల్యాండింగ్ కానుంది. అయితే ఒకేసారి రెండింటికి సిగ్నల్స్ ఇవ్వడంతో రన్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏటీసీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కిలోమీటర్లు మాత్రేమే ఉంది. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలకు అనుమతి ఉండదు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు.
Read Also: Ukraine Drone Attack: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్
ఈ ప్రమాదం తప్పడం వల్ల సుమారు 300 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆ రెండు విమానాల్లో 300 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అహ్మదాబాద్ నుంచి వస్తున్న విమానంలో ఉన్న 45 ఏళ్ల మహిళా పైలెట్ సోనుగిల్ ఈ ప్రమాదాన్ని తప్పించినట్లు చెబుతున్నారు. ఆమె ఏటీసీకి సంకేతాలు ఇవ్వడం వల్ల ఆ వెంటనే టేకాఫ్ తీసుకుంటున్న విమానాన్ని ఏటీసీ నిలిపివేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు