శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా.. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
READ MORE: Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం నేడు ఎంత ఉందంటే ?
అధికారులు వివరాల ప్రకారం.. జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌తో గడ్డి కోస్తుండగా అది మొరాయించింది. ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడంతో దానిని అక్కడి నుంచి తరలించడానికి సిబ్బంది 20 నిమిషాల పాటు శ్రమించారు. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతా నుంచి పట్నా వెళ్లే ఇండిగోకు చెందిన విమానం ల్యాండ్ కావాల్సిఉంది. అయితే రన్‌వేకు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో విమానం 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ పూర్తి అంశంపై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికులకు కలిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు.
READ MORE:UP: పది మంది శిశువుల సజీవ దహనం.. స్పందించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి