Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. బోన్ లో మేకను ఉంచి పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వేశారు. మరి ప్లాన్ వలలో చిరుత చిక్కుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది కానీ.. ఆ తరువాత చిరుత ఎక్కడికి వెళ్లింది, దాని ఆనవాలు అయితే కనిపించలేదు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు.
Read also: Gold Price Today : పసిడి ధరలకు బ్రేకులు.. స్థిరంగా వెండి ధరలు..
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ఎయిర్ పోర్ట్ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.
Read also: Elections 2024: నామినేషన్ల ఉప సంహరణకు నేడే డెడ్‌లైన్.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది..
చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది. కాగా.. ఇప్పుడు మరోమారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజులుగా చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచరించినట్లు తెలిస్తే… అదే ప్రాంతంలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
UttaraKhand : రైలు – పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాపాడిన లేడి కానిస్టేబుల్
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!