Komatireddy Venakt Reddy : తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల…
మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక, క్యాబినెట్ అనుమతి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి…
ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు.…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్‌ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.
Komatireddy Venkat Reddy : ఓఆర్‌ఆర్ అమ్ముకున్న వాళ్ళ పై విచారణ కి అదేశించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7 వేల కోట్లకు అమ్మిందని ఆయన అన్నారు. హరీష్ రావు కి.. మామ మీదనో.. బామ్మర్ది మీదనో కోపం తోటి అసెంబ్లీ లో విచారణ కి డిమాండ్ చేశారన్నారు. సీఎం విచారణకు ఆదేశించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని,…
CM Revanth Reddy : రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో…
Future Hub : తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది. గ్రేట్ ప్లాన్ తో.. గ్రేటర్ విజన్ తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. సికింద్రాబాద్లోని…