Future Hub : ఫ్యూచర్ హబ్‌గా హైదరాబాద్.. 2050 మాస్టర్ విజన్‌తో అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Future Hub : తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది. గ్రేట్ ప్లాన్ తో.. గ్రేటర్ విజన్ తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. సికింద్రాబాద్లోని అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై రూ.2232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ నాగ్ పూర్ జాతీయ రహదారిపై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితో సిటీలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించే వీలుంది.
ఈ కారిడార్ల నిర్మాణానికి, మొహిదీపట్నం స్కై వాక్ నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. గడిచిన పదేండ్లలో పెండింగ్లో ఉన్న ఈ భూముల స్వాధీన ప్రక్రియను కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సాధించగలిగింది. హైదరాబాద్‌లోని చెర్వులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. పోలీస్, ట్రాఫిక్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో మురికి నీటి కూపంగా మారిన మూసీ నది పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నగరంలోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ను పునరుద్ధరించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మూసీ నదిలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తోంది.
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పంత్.. 9ఏళ్ల ప్రయాణంపై ఎమోషనల్ పోస్టు (వీడియో)
ఎల్లంపల్లి నుంచి మరో 20 టీఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్ లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి వీలుగా బహుళ ప్రయోజనాలుండే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా బాపూఘాట్ ను దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ను ఇక్కడ నెలకొల్పనుంది. మీర్ అలం చెరువు సమీపంలో దాదాపు రూ. 360 కోట్ల అంచనా వ్యయంతో 4-లేన్ వంతెన నిర్మాణం చేపడుతోంది. ఎల్ బీ నగర్ సమీపంలో బైరామాల్ గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించింది. ఆరంఘఢ్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ ను త్వరలోనే ప్రారంభించనుంది.
హైదరాబాద్ సిటీలో రవాణా సేవలను విస్తరించేందుకు కొత్తగా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయటంతో పాటు మహాలక్ష్మి ద్వారా సిటీ బస్సుల్లో దాదాపు 50 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. రూ. 24,237 కోట్లతో మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 69 కిలోమీటర్లకు అదనంగా ఫేజ్ 2లో పాతబస్తీ చుట్టుముట్టేలా ఎయిర్ పోర్టు వరకు 76.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టనుంది. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ నుంచి కోకాపేట్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట , మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు రెండో దశలో విస్తరిస్తారు.
హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్ లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వీటితో పాటు ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనాన్ని గోషా మహల్ సమీపంలో నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (HCITI) ప్రాజెక్ట్ లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ. 8,996 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. రూ.596.2 కోట్ల అంచనాలతో వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టింది. వాన పడితే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. నీళ్లు నిల్వ చేరే ప్రధాన జంక్షన్లన్నింటా వాటర్ ఇన్ టేక్ వెల్స్ తవ్వించి.. అక్కడి నుంచి నీటిని డ్రైనేజీలకు , నాలాలకు తరలించే ప్రాజెక్టును చేపట్టారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్ల అంచనాలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్, రోడ్ నెంబర్-45 జంక్షన్, ఫిల్మ్నగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది.. హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్ పల్లి మీదుగా మహబూబ్ నగర్ లోని ఆమనగల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం నుంచి నల్గొండ జిల్లా చౌటుప్పల్ వరకు దాదాపు 189 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మిస్తారు.
హైదరాబాద్ లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతుంది. ఫార్మా సిటీతో పాటు ఏఐ సిటీ, సాఫ్ట్ వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
CM Revanth Reddy : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!