దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు.…
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను చివరి షెడ్యూల్ లో విదేశాల్లో చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” టీం ఈ చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ ల్యాండ్ అయిన పిక్ ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “ఆర్ఆర్ఆర్” టీం షేర్ చేసింది. ఆగష్టు చివరికల్లా ఈ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి రానున్నారు. ఇక ఇప్పటికే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే షెడ్యూల్ ను యూరప్‌లో చిత్రేకరించనున్నారు. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సినిమాలోని చివరి పాటను ఈ యూరప్ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. మేకర్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అక్కడి మనోహరమైన ప్రదేశాలలో తెరకెక్కించే ఈ సాంగ్ తెరపై విజువల్ వండర్ గా ఉండబోతోందట. త్వరలోనే “ఆర్ఆర్ఆర్”…