దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను చివరి షెడ్యూల్ లో విదేశాల్లో చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” టీం ఈ చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ ల్యాండ్ అయిన పిక్ ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “ఆర్ఆర్ఆర్” టీం షేర్ చేసింది. ఆగష్టు చివరికల్లా ఈ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి రానున్నారు. ఇక ఇప్పటికే మేకర్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మేకింగ్ వీడియోను, దోస్తీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ రెండింటికీ మంచి స్పందన వచ్చింది. షూటింగ్ అనంతరం సినిమా ప్రమోషన్లలో మరింత వేగం పెంచనున్నారు.
Read Also : అదరగొడుతున్న “వాలిమై” ఫస్ట్ సింగిల్
డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రామరాజు పాత్రను పోషిస్తున్నారు. ప్రధాన నటులతో పాటు “ఆర్‌ఆర్‌ఆర్”లో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్… రామ్ చరణ్ కు జంటగా, ఒలివియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ గురువుగా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Team #RRRMovie arrives in #Ukraine for the last schedule of the film… 🕺🕺🤞🏻
— DVV Entertainment (@DVVMovies) August 3, 2021