ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపబోతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో…
ముంబైలోని డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్‌లోని 56వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా, కోల్‌కతా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత కోల్‌కాతా టాపార్డర్ సృష్టించిన విధ్వంసం చూసి.. ముంబై ముందు భారీ లక్ష్యం పెడతారని అంతా అనుకున్నారు. గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా…
ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్లో రాణిస్తోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.. ఒక్కరు తప్ప! అతడే.. సూర్య కుమార్ యాదవ్. మొదట్నుంచి ముంబై జట్టులో ఇతనొక్కడే బాగా ఆడుతున్నాడు. చాలా కసితో ఆడుతున్న ఇతగాడు, జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్మ్సన్. అలాంటి సూర్య కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ సీజన్…
ముంబై ఇండియన్స్ జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో కీరన్ పొలార్డ్ ఒకడు. ఎన్నోసార్లు జట్టు ఆపదలో ఉన్నప్పుడు నెట్టుకురావడమే కాదు, కొన్నిసార్లు ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన ఘనత అతని సొంతం. అవసరమైనప్పుడల్లా బ్యాట్‌కి పని చెప్పడమే కాదు, బంతితోనూ మాయ చేయగలడు. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే, యాజమాన్యం రూ. 6 కోట్లు వెచ్చించి మరీ అతడ్ని రిటైన్ చేసుకుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా మెరుపులు మెరిపిస్తాడని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఇతను పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తున్నాడు.…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. ముంబై బౌలర్ డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) రాణించారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) విఫలమయ్యాడు. పొలార్డ్ (4) కూడా వెంటనే వెనుతిరిగాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి రాణించాడు. తిలక్ వర్మ 16…
గురువారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ టీమిండియాను ఎలా…
ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. దీంతో టోర్నీలో ఆ జట్టుకు వరుసగా ఆరో ఓటమి ఎదురైంది. శనివారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(13) విఫలమయ్యారు. బ్రెవిస్ (31), సూర్య కుమార్ యాదవ్ (37), తిలక్ వర్మ(26) రాణించినా భారీ స్కోర్లు…
టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు బాదిన ఆటగాడిగా రోహిత్ ఘనత దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు…